భారత్‌లో ఇళ్ల కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి.. టాప్‌-5 నగరాలివే!

ఎన్‌ఆర్‌ఐలు: విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) స్వదేశంలో ఇళ్లు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో పెట్టుబడి, ఆస్తి విలువ పెరుగుదలే ప్రధాన లక్ష్యాలుగా ఉండగా.. ప్రస్తుతం అద్దె ఆదాయం, మెరుగైన నిర్మాణ నాణ్యత, రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు వంటి పలు కీలక అంశాలకూ వారు ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం. తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన నివాసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణే, హైదరాబాద్‌ నగరాలు.

ఎన్‌ఆర్‌ఐలు, NewzFast Telugu: విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) స్వదేశంలో ఇళ్లు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో పెట్టుబడి, ఆస్తి విలువ పెరుగుదలే ప్రధాన లక్ష్యాలుగా ఉండగా..

ప్రస్తుతం అద్దె ఆదాయం, మెరుగైన నిర్మాణ నాణ్యత, రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు వంటి పలు కీలక అంశాలకూ వారు ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం.

తల్లిదండ్రులకు సౌకర్యవంతమైన నివాసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణే, హైదరాబాద్‌ నగరాలు ఎన్‌ఆర్‌ఐల ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ముంబై, బెంగళూరుకు ప్రత్యేక ఆదరణ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అంతర్జాతీయ విమాన సదుపాయాలు, విస్తరిస్తున్న మౌలిక వసతులు, వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న నివాస గృహాలు ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షిస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో కొనుగోలు అవకాశాలు పెరుగుతున్నాయి.

ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో వైట్‌ఫీల్డ్‌, సర్జాపూర్‌, ఉత్తర బెంగళూరు ప్రాంతాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఉండటం కూడా పెట్టుబడిదారులకు కలిసొచ్చే అంశంగా మారుతోంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణే ప్రాధాన్యం

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని గురుగ్రామ్‌లో ప్రీమియం నివాస ప్రాజెక్టులు, కార్పొరేట్‌ సంస్థలు, మెరుగుపడుతున్న రవాణా సదుపాయాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పుణేలో ఉద్యోగ అవకాశాలతో పాటు విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, ముంబైకి సమీపంలో ప్రశాంతమైన జీవనశైలి ఉండటం సానుకూల అంశాలుగా నిలుస్తున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు