సోమవారం ట్రేడింగ్ కోసం 3 బెస్ట్ స్టాక్స్ రికమండ్ చేసిన సుమీత్ బగాడియా

సుమీత్ బగాడియా: సోమవారం ట్రేడింగ్ కోసం మిడ్ క్యాప్ కేటగిరికి చెందిన మూడు స్టాక్స్ కి బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్ లను ప్రముఖ ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా సూచించారు. ఈ మూడు స్టాక్స్ కూడా రూ. 100 లోపు ధరలోనే ఉండటం విశేషం.

సుమీత్ బగాడియా, NewzFast Telugu: సోమవారం ట్రేడింగ్ కోసం మిడ్ క్యాప్ కేటగిరికి చెందిన 3 స్టాక్స్ కి బై రేటింగ్ తో పాటు టార్గెట్ ప్రైజ్ ని కూడా ఇస్తున్నట్లు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి సూచించారు. ది ఎకనామిక్ టైమ్స్ తెలుగు నివేదిక ప్రకారం, ఈ మూడు స్టాక్స్ కూడా రూ.

100 లోపు ధరలోనే ట్రేడ్ అవుతుండటం గమనార్హం.

సిఫార్సు చేసిన మూడు స్టాక్స్ వివరాలు

ఈ జాబితాలో పవర్ జనరేషన్ రంగానికి చెందిన SJVN లిమిటెడ్, NHPC లిమిటెడ్ మరియు బ్యాంకింగ్ రంగానికి చెందిన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు మార్కెట్ నిపుణుల సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

SJVN లిమిటెడ్

SJVN లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ తో పాటు రూ. 58.59 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు సుమీత్ బగాడియా తెలిపారు.

ఈ షేరుకి రూ. 50.40 స్టాప్ లాస్ అందించగా, రూ.

53.39 ధర వద్ద కొనుగోలు చేయాలని అనలిస్ట్ సూచించారు. చివరి ట్రేడింగ్ సెషన్ లో ఈ షేరు ధర 1.56 శాతం లాభపడి రూ.

53.22 వద్ద ముగిసింది.

NHPC లిమిటెడ్

NHPC లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ తో పాటు రూ. 85 టార్గెట్ ప్రైజ్ ను ఇచ్చారు.

దీనికి రూ. 73.80 స్టాప్ లాస్ ని సూచిస్తూ, రూ.

77.74 ధర వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు. చివరి ట్రేడింగ్ సెషన్ లో ఈ షేరు ధర 0.70 శాతం లాభపడి రూ.

77.74 వద్ద ముగిసింది.

బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లిమిటెడ్

బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ షేరుకి బై రేటింగ్ తో పాటు రూ. 89 టార్గెట్ ప్రైజ్ ను కేటాయించారు.

అలాగే రూ. 77 స్టాప్ లాస్ ని అందించి, రూ.

81.36 ధర వద్ద కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు