మురసు తుఫాన్, NewzFast Telugu (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారి..
ఎట్టకేలకు తుఫాన్‌గా మారినట్లు టీవీ9 తెలుగు వెల్లడించింది. ఈ తుఫాన్‌కు అధికారులు ‘మురసు’ అని నామకరణం చేశారు.
గతంలో వచ్చిన ఆర్నబ్ తుఫాన్‌కు బంగ్లాదేశ్ పేరు పెట్టగా, ఈ మురాసు తుఫాన్‌కు భారత్ నామకరణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మురాస్ అంటే యుద్ధ భేరీ అని వివరించారు.
ప్రస్తుతం ఈ తుఫాన్ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోందని, సోమవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మంగళవారం నాడు నెల్లూరు – నరసాపురం మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
ఈ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అలాగే మురసు తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నవంబర్ 2, 3 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని సమాచారం అందించారు.

