రంగు మారే టమోటాలు, NewzFast Telugu: వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికాలోని ప్రసిద్ధ కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు తెరతీశారు. పొలంలో నైట్రోజన్ శాతం తగ్గినప్పుడు వెంటనే రంగు మారి రైతులకు సంకేతాలు పంపే కొత్త రకం టమోటా మొక్కలను రూపకల్పన చేశారు.
బీట్రూట్ రంగుతో జీవ సంకేతాలు
వన్ఇండియా తెలుగు కథనం ప్రకారం, రెడ్అలర్ట్ పేరుతో పిలిచే ఈ జన్యుమార్పిడి మొక్కలు నేలలో పోషకాల లోపం ఏర్పడగానే ఎరుపు-ఊదా రంగులోకి మారి పంట స్థితిని తెలియజేస్తాయి. సాధారణంగా నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, అయితే ఈలోపే నష్టం జరుగుతుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు మొక్క వేళ్ల భాగంలో నత్రజని లభ్యత తగ్గగానే, బీట్రూట్లో ఉండే బెటానిన్ వర్ణద్రవ్యాన్ని కాండం, ఆకులు ఉత్పత్తి చేస్తాయి.
క్షేత్రస్థాయిలో పరీక్షలు
ప్రయోగశాల నుంచి బయటకు తెచ్చిన ఈ సూచిక మొక్కలను ప్రస్తుతం న్యూయార్క్‌లోని రీసెర్చ్ ఫామ్‌లో నిజమైన పొలం పరిస్థితులలో పరీక్షిస్తున్నారు. వీటిని ఆహారం లేదా విక్రయం కోసం కాకుండా కేవలం సింటినెల్ ప్లాంట్స్ (సూచిక మొక్కలు) గా మాత్రమే ఉపయోగిస్తారు.
డ్రోన్లు, ప్రత్యేక స్పెక్ట్రోమీటర్ల సహాయంతో శాస్త్రవేత్తలు ఆకుల రంగు తీవ్రతను నిరంతరం పరిశీలిస్తున్నారు.


