ఏపీకి ‘మురసు’ తుపాను ముప్పు.. ఆ 3 రోజులు భారీ వర్షాలు!

మురసు తుపాను: మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

మురసు తుపాను, NewzFast Telugu (అమరావతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ తుపాను మరింత బలపడి రానున్న ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య నెల్లూరు – నరసాపురం తీరప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తీరం వెంబడి గంటకు బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

తుపాను తీవ్రత దృష్ట్యా తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు