హైదరాబాద్‌లో మోసం: బంగారు నగరాలతో పరారైన ర్యాపిడో డ్రైవర్

ర్యాపిడో డ్రైవర్: ర్యాపిడో డ్రైవర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో బంగారు నగల పార్సిల్‌తో పరారయ్యాడు. వివో మొబైల్ ఫోన్ సంస్థ మేనేజర్ దత్త ప్రసాద్ బంధువులకు పంపాల్సిన రూ. 62,383 విలువైన బంగారు ఉంగరాలు, గాజులను డెలివరీ కోసం ఇచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ర్యాపిడో డ్రైవర్, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలో ర్యాపిడో సేవలను ఉపయోగించుకుని బంగారు నగలు పంపిన ఓ వ్యక్తి మోసపోయినట్లు ప్రైమ్9న్యూస్ వెల్లడించింది. జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రైమ్9న్యూస్ కథనం ప్రకారం, వివో మొబైల్ ఫోన్ సంస్థ మేనేజర్ దత్త ప్రసాద్ తన బంధువులకు రూ. 62,383 విలువైన బంగారు నగరాలు (ఉంగరాలు, గాజులు) పంపాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఆయన బంగారు నగలను ప్యాక్ చేసి ర్యాపిడో పార్సిల్ సేవలను బుక్ చేశారు. ఆఫీసులో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఆ పార్సిల్‌ను ర్యాపిడో డ్రైవర్‌కు అందజేయాలని సూచించారు.

ఆ సమయంలో గీతిమెట్టు మురళి అనే ర్యాపిడో డ్రైవర్ ఆ పార్సిల్‌ను అందుకున్నాడు. నాగోల్ వరకు వెళ్లాలంటే అదనంగా రూ.

100 పెట్రోల్ ఖర్చు అవుతుందని డ్రైవర్ తెలపడంతో, సెక్యూరిటీ గార్డు ద్వారా దత్త ప్రసాద్ ఫోన్ పే ద్వారా ఆ మొత్తాన్ని పంపించారు. ఆ తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి బయలుదేరాడు.

కొద్దిసేపటి తర్వాత దత్త ప్రసాద్ డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. కొద్దిసేపటికే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు దత్త ప్రసాద్ గ్రహించినట్లు ప్రైమ్9న్యూస్ తెలిపింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు