రాధిక పనిమనిషి కుమారుడు, NewzFast Telugu: సీనియర్ నటి రాధిక ఇంటిలో పనిచేస్తున్న మహిళ కుమారుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసుల కథనం ద్వారా తెలిసింది. ఈ సంచలన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
చిత్రజ్యోతి ప్రచురించిన కథనం ప్రకారం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని సిరువత్తూరు గ్రామానికి చెందిన రమేష్, ఎళిల్ సెల్వి దంపతుల కుమారుడు ప్రశాంత్ (19) రోజు కూలి పనులు చేస్తుండేవాడు. ఎళిల్ సెల్వి చెన్నైలోని నటి రాధిక ఇంట్లో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 27న ప్రశాంత్ తన తల్లిని చూసేందుకు చెన్నైకి బయలుదేరాడు. అయితే అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ప్రశాంత్ ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా సిరువత్తురైకి చెందిన దేవరాసు, దినేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ప్రశాంత్‌ను పొన్నేరి తీరానికి రప్పించి హత్య చేసి, అక్కడే పాతిపెట్టినట్లు వెల్లడించారు.
ఈ హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు నిందితుల వద్ద లోతుగా ఆరా తీస్తున్నారు.




