Syed Zubair rowdy sheet Sircilla, NewzFast Telugu (సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన సయ్యద్ జుబేర్పై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్ర చారి తెలిపారు.
అతని నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉపేక్షించేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు.


