ఆల్వాల్ డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయం, NewzFast Telugu (హైదరాబాద్, ఆల్వాల్): డిఫెన్స్ క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు లభించే మద్యం కోటాను కొందరు అక్రమ వ్యాపారంగా మార్చుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఆల్వాల్ ప్రాంతంలో ఈ దందా విస్తరిస్తుండటంతో అధికారులు నిఘా పెట్టారు.
స్టేట్ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. లోతుకుంట ప్రాంతంలో ఒక ఇంట్లో 96 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, మాజీ సైనికుడైన భర్త క్యాంటీన్ల నుంచి మద్యం తెస్తుండగా, భార్య ఇంట్లోనే స్థానికులకు విక్రయిస్తున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.
మరో ఘటనలో న్యూ బోయిన్పల్లి, సౌజన్య కాలనీలో ఒక మహిళ ఇంట్లో 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న ఆమెను అదుపులోకి తీసుకుని ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
రెండు దాడుల్లో కలిపి 163 బాటిళ్లు సీజ్ చేశారు.
రక్షణ శాఖ ఇచ్చే వెసులుబాటును దుర్వినియోగం చేసి అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

