సీతాపూర్ ట్రాక్టర్ ప్రమాదం ఐదుగురు మహిళలు మృతి, NewzFast Telugu (ఉత్తరప్రదేశ్): పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారి పుట్టువెంట్రుకల వేడుక ముగించుకుని ట్రాక్టర్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్-ట్రాలీ రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ఘటనలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రాలీ కింద చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

