రాజస్థాన్ నాగోర్ గన్ పౌడర్ గోదాం పేలుడు, NewzFast Telugu (నాగోర్, రాజస్థాన్): రాజస్థాన్‌లోని నాగోర్‌లో బాణాసంచా, గన్ పౌడర్ తయారీ గోదాంలో భారీ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారు నాగోర్ పట్టణంలోని బన్ బజార్ వాడ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలం చుట్టూ సుమారు 100 అడుగుల వ్యాసార్థంలో ఉన్న ఇళ్లు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
గోదాంలో పొటాషియం నైట్రేట్ సహాయంతో గన్ పౌడర్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

