దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయిస్తోంది: రాహుల్ గాంధీ ఆరోపణలు

రాహుల్ గాంధీ: ఢిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో వ్యాపారుల దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో వ్యాపార నష్టాలపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

రాహుల్ గాంధీ, NewzFast Telugu (న్యూఢిల్లీ): ఢిల్లీలో వ్యాపారుల నష్టాల అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహిస్తున్న ర్యాలీతో వ్యాపారాలు దెబ్బతింటాయన్న బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర కౌంటర్‌ ఇచ్చారు.

ఢిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో దుకాణాలను బీజేపీ బలవంతంగా మూసివేయించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నదెవరో ప్రజలు తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

రామ్‌లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

మరోవైపు, పండగల సీజన్‌లో ఈ కార్యక్రమం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వ్యాపార సంఘాలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి. ర్యాలీని నవంబర్‌ 10 తర్వాత నిర్వహించాలని కోరాయి.

ఢిల్లీ ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) కూడా వ్యాపారాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రామ్‌లీలా మైదానం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 లక్షల దుకాణాలు ఉండగా, వాటిలో 2.5 లక్షల వరకు మూతపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు