ఓ నా సిద్ధయ్య, NewzFast Telugu (హైదరాబాద్): సిద్ధు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన జంటగా తెరకెక్కిన ఎమోషనల్ ప్రైవేట్ ఆల్బమ్ ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ తాజాగా విడుదల అయింది. భార్యాభర్తల ప్రేమానుబంధం, పరస్పర అవగాహన, తోడుగా నిలిచే తత్వం మరియు సేవా గుణం వంటి మంచి అంశాలను చూపిస్తూ ఈ పాటను పల్లెటూరి నేపథ్యంలో రూపొందించారు.
ఈ పాటను రామ్ అద్నాన్ రాయగా, కళ్యాణ్ సంగీతం అందించారు. రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ గీతాన్ని ఆలపించారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. వర్షం పడినప్పటికీ సినిమా థియేటర్లో చూసే అనుభూతిని ప్రేక్షకులకు అందించేలా అవుట్‌డోర్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి పాటను రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ వేడుకకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, నటుడు ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
పాట విడుదల అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ, ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం వినూత్నంగా ఉందని, ఈ ప్రయత్నం చేసిన బృందాన్ని అభినందిస్తూ పాట విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, సాంగ్ పెద్ద విజయం సాధించాలని కోరారు.
కాగా, ఈ ఈవెంట్ సందర్భంగా సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లను పంపిణీ చేశారు.




