మీర్‌పేట్ కుటుంబ కలహాల హత్య కేసు, NewzFast Telugu (రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్): కుటుంబ కలహాలతో జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జయశ్రీ కాలనీకి చెందిన ఒక కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఈ దారుణం జరిగింది.
సమాచారం ప్రకారం, అల్లుడు సిద్ధిక్ ఒక్కసారిగా కత్తితో తన అత్త, వదిన, తోడల్లుడు, మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్ల తీవ్రతకు ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సిద్ధిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలే ప్రధాన కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


