హీరోయిన్ సునయన , NewzFast Telugu (Filmibeat Telugu): ప్రముఖ నటి సునయనను పోలిన అసభ్యకర వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ అంశంపై స్పందించిన నటి, తన ముఖాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి ఈ వీడియోను సృష్టించారని వెల్లడించారు.
ఈ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తన గౌరవం, గోప్యతను దెబ్బతీసే ఈ ఫేక్ వీడియోను రూపొందించిన వారితో పాటు, దాన్ని షేర్ చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని సునయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా పోస్ట్ చేశారు.
ఎవరూ ఈ వీడియోను ఫార్వర్డ్ చేయవద్దని, ఎక్కడైనా కనిపిస్తే రిపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.




