GHMC Assistant Director Yadagiri Rao ACB raids, NewzFast Telugu (Hyderabad): జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత తనిఖీలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌తో పాటు సూర్యాపేటలోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో నివాసముంటున్న యాదగిరి రావు ఇంట్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తోంది.
గత కొంతకాలంగా ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన అధికారులు ఈరోజు ఏకకాలంలో దాడులకు దిగారు.
ఈ సోదాల్లో భాగంగా స్థిర, చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు మరియు కీలక ఆర్థిక లావాదేవీల పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సోదాలు ఇంకా కొనసాగుతుండగా, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.


