ఐఫోన్‌ డ్యుయో స్క్రీన్ పగుళ్లపై యాపిల్ కీలక నిర్ణయం.. స్టోర్లకు కొత్త మార్గదర్శకాలు!

ఐఫోన్‌ డ్యుయో: ఐఫోన్‌ డ్యుయో వినియోగదారులకు ఎదురవుతున్న స్క్రీన్‌ పగుళ్ల సమస్యపై యాపిల్‌ సంస్థ స్పందించింది. తమ రిటైల్‌ స్టోర్లు మరియు అధీకృత సర్వీస్‌ కేంద్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ అంతర్గత మెమో పంపినట్లు మాక్‌రూమర్స్‌ వెల్లడించింది.

ఐఫోన్‌ డ్యుయో , NewzFast Telugu: యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఐఫోన్‌ డ్యుయో వినియోగదారులకు ఎదురవుతున్న స్క్రీన్‌ సమస్యపై ఆ సంస్థ స్పందించింది. ఫోన్‌ లోపలి డిస్‌ప్లే పగుళ్లకు గురవుతోందంటూ కొందరు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో..

తమ రిటైల్‌ స్టోర్లు, అధీకృత సర్వీస్‌ కేంద్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

సమస్యతో వచ్చిన ఫోన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రామాణిక సర్వీసింగ్‌ విధానాల ప్రకారం రిపేర్‌ చేయాలని లేదా అవసరమైతే కొత్త ఫోన్‌ ఇవ్వాలని సిబ్బందికి సూచించింది. ఈ మేరకు అంతర్గత మెమో పంపినట్లు ‘మాక్‌రూమర్స్‌’ వెల్లడించింది.

ఐఫోన్‌ డ్యుయో వినియోగంలోకి వచ్చిన కొన్ని రోజులకే స్క్రీన్‌పై పగుళ్లు, ప్రకాశవంతమైన గీతలు కనిపిస్తున్నాయంటూ కొందరు వినియోగదారులు సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. ముఖ్యంగా ఫోన్‌ మడిచే మధ్య భాగంలోని హింజ్‌ దగ్గర ఈ సమస్య కనిపిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ వినియోగదారుడు తన ఫోన్‌ 20 సార్లు కూడా తెరవకముందే డిస్‌ప్లే దెబ్బతిన్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు.

ఈ సమస్యకు కారణం ఏంటో యాపిల్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, రిపేర్‌ సంస్థ ఐఫిక్సిట్‌ చేసిన పరిశీలనలో హింజ్‌ వ్యవస్థలో లోపం ఉండే అవకాశం ఉందని తేలింది.

ఫోన్‌ను మడిచినప్పుడు హింజ్‌లోని సెంట్రల్‌ సపోర్ట్‌ బార్‌ పూర్తిగా వెనక్కి జరగకపోవడం వల్ల డిస్‌ప్లేపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడవచ్చని అంచనా వేసింది. యాపిల్‌ దీనిని ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది.

ఈ సమస్య కొన్ని ఫోన్లకే పరిమితమని యాపిల్‌ చెబుతోంది. ఇప్పటివరకు ఎలాంటి రీకాల్‌ ప్రకటించలేదని, ప్రత్యేకంగా అందరికీ వర్తించే ఉచిత రిపేర్‌ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించలేదని సమాచారం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు