Bhupalpally husband murder by wife and lover, NewzFast Telugu (Jayashankar Bhupalpally district): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం, భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం తండాకు చెందిన చందు (40) రైతుగా పనిచేసేవాడు. 2014లో పావనితో అతనికి వివాహం జరిగింది.
కొంతకాలంగా పావని అదే ప్రాంతానికి చెందిన ధరావత్ సంతోష్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి.
గురువారం రాత్రి చందు ఇంట్లో ఉండగా, పథకం ప్రకారం సంతోష్‌ను పావని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి చందుపై దాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి బైక్‌పై తీసుకెళ్లి సమీప గ్రామ శివారులోని రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న సంచిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి చూడగా చందు మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు పావని, సంతోష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.

