అలాస్కా సెనేట్ ఎన్నికల వివాదం, NewzFast Telugu (అంతర్జాతీయ వార్తలు): అమెరికాలో మధ్యంతర ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మధ్య పోరు తీవ్రమవుతున్న తరుణంలో, అలాస్కా రాష్ట్రంలోని సెనేట్ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండటం, ఓట్లు చీల్చేందుకు ఉద్దేశపూర్వకంగా మరో అభ్యర్థిని రంగంలోకి దించారన్న ఆరోపణలు, దీనిపై ఫెడరల్ దర్యాప్తు వంటి పరిణామాలు ఈ ఎన్నికను కీలక మలుపు తిప్పాయి.




