యూఏఈ వెళ్లే భారతీయ పౌరులకు ఆరోగ్య బీమా తప్పనిసరి: రాయబార కార్యాలయం

యూఏఈ ఆరోగ్య బీమా: యూఏఈకి విజిట్ లేదా టూరిస్ట్ వీసాలపై వెళ్లే భారతీయ పౌరులు ప్రయాణానికి ముందే తప్పనిసరిగా తగిన మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం మరియు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ సంయుక్తంగా సూచించాయి.

యూఏఈ ఆరోగ్య బీమా, NewzFast Telugu (అబుధాబీ): యూఏఈకి విజిట్ లేదా టూరిస్ట్ వీసాలపై వెళ్లే భారతీయ పౌరులు ప్రయాణానికి ముందే తప్పనిసరిగా తగిన మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ సంయుక్తంగా స్పష్టం చేశాయి. ఈ మేరకు అధికారులు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేశారు.

యూఏఈలో అనుకోని అనారోగ్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ఆస్పత్రి బిల్లులు వస్తున్నాయని, సరైన బీమా లేక అనేకమంది భారతీయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. నగదు రహిత (Cashless) చికిత్సతో పాటు స్వదేశానికి తరలించే (రిపాట్రియేషన్) ఖర్చులను కవర్ చేసే పాలసీలను ఎంచుకోవాలని సూచించారు.

కేవలం తాత్కాలిక పర్యాటకులే కాకుండా, యూఏఈలో ఉద్యోగ వీసాలపై పనిచేస్తున్న వారు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా తమ ఆరోగ్య బీమా స్థితిని పునఃపరిశీలించుకోవాలని కోరారు. సంస్థలు ఇచ్చే ప్రాథమిక ఇన్సూరెన్స్‌లో తీవ్రమైన జబ్బులకు పరిమితులు ఉండటం వల్ల అదనపు ఖర్చుల భారం పడుతోందని, పూర్తి వైద్య ఖర్చులతో పాటు స్వదేశానికి పంపే ఖర్చులను కవర్ చేసేలా ఇన్సూరెన్స్ ఉందో లేਦో చూసుకోవాలని తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు