మురసు తుపాను, NewzFast Telugu (హైదరాబాద్/అమరావతి): బంగాళాఖాతంలో ఏర్పడనున్న మురసు తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే కాకుండా తెలంగాణపై కూడా గట్టిగా ఉండనుందని వాతావరణ శాఖ మరియు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం అందింది.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. సోమవారం (నవంబర్ 2) సాయంత్రానికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
తెలంగాణలోనూ నవంబర్ 2 నుంచి 4 మధ్యకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.


