గౌహతి హోటల్ ఫైరింగ్ కేసు ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్, NewzFast Telugu (అస్సాం): అస్సాంలోని గౌహతిలో ఓ హోటల్ ప్రాపర్టీ విషయంలో జరిగిన ఫైరింగ్ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం, తెల్లవారుజామున 3.10 గంటలకు గౌరిసాగర్ వద్ద జరిగిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. మరో కేసులో శివసాగర్ జిల్లాకు అతడిని తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్పీ పాపోరి చేతియా తెలిపారు.
హోటల్ ఫైరింగ్ కేసులో ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు ఘనాకంట గగోయి, 2024 నాటి బ్యాంక్ ఫ్రాడ్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడిని అక్కడికి తీసుకెళ్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు శిక్షణ పొందిన షూటర్ అని, పలు రకాల ఆయుధాలపై నైపుణ్యం కలవాడని తెలుస్తోంది. పోలీసు వాహనం నుంచి దిగిన తర్వాత సర్వీస్ వెపన్ లాక్కునే ప్రయత్నం చేసి పోలీసులపై దాడి చేశాడని, అధికారిని రక్షించే క్రమంలో కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు.
గాయపడిన గగోయిని ఆస్పత్రిలో చేర్చగా, అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

