స్నేహితుడి హత్య కేసులో నిందితుడి లొంగుబాటు, NewzFast Telugu (మహారాష్ట్ర): ఒక చిన్న గొడవ విషయంలో ఆప్త మిత్రుడిని హత్య చేసిన వ్యక్తి, పీడకలల ధాటికి తట్టుకోలేక పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన గత నెల 9న మహారాష్ట్రలోని మోతగావ్లో జరిగింది.
విశాల్ కదమ్, ప్రభు కర్కడే ఆప్త మిత్రులు. ఒక రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగుతుండగా వారి మధ్య చిన్న వాదన జరిగింది.
ఆ సమయంలో కోపంతో ప్రభు విశాల్‌పై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్ని చంపేశాడు.
హత్య విషయంలో ఆందోళన చెందిన నిందితుడు తన యజమాని సందేశ్‌కు విషయాన్ని తెలిపాడు. అతడి సాయంతో ఒక వాగు వద్ద విశాల్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సమాచారం.
ఆ తర్వాత 20 రోజుల పాటు మృతుడు కలల్లో వేధించడంతో ప్రభు నిద్రలేని రాత్రులు గడిపాడు. పశ్చాత్తాపంతో కుంగిపోయిన అతడు థాణె పోలీసుల ఎదుట తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
కోర్టు ఆదేశాల మేరకు ప్రభు, సందేశ్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.


