పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద వైఎస్‌ జగన్‌ బైఠాయింపు.. రీపోలింగ్‌కు డిమాండ్‌

YS Jagan Protest: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు.

YS Jagan Protest, NewzFast Telugu (పులివెందుల): కడప జిల్లా పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని, వైసీపీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదివారం పులివెందుల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట బైటాయించారు.

ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లగా అధికారులు లోనికి అనుమతించలేదని సమాచారం. దీంతో అధికారులే బయటకు వచ్చి జగన్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా టీడీపీ గూండాల దౌర్జాన్యాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

రీపోలింగ్‌కు డిమాండ్

అంతకుముందు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు.

తమ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని, పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని విమర్శించారు. వెంటనే ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్‌ జరపాలని డిమాండ్ చేశారు.

పులివెందులలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రమీల పైనా దాడి చేశారని, ఇదీ ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఓటర్లను అడ్డుకుని ఓటర్‌ స్లిప్పులు లాక్కున్నారని వెల్లడించారు.

మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసిన ఆయన, కోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పాటించడం లేదని ఆరోపించారు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్‌, సీసీ కెమెరాలు లేవని, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు