రామాయణం సినిమా: రావణ-జటాయు పోరు వెనుక ఆరున్నరేళ్ల శ్రమ!

రామాయణం: రామాయణం సినిమాకు సంబంధించి దర్శకుడు నితీష్ తివారీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రావణుడు మరియు జటాయువు మధ్య జరిగే భీకర పోరాట సన్నివేశం కోసం ఏకంగా ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించినట్లు తెలిపారు.

రామాయణం , NewzFast Telugu (బాలీవుడ్): బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ `రామాయణం`పై రోజుకో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక అద్భుతంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని రావణుడు – జటాయువు మధ్య జరిగే భీకర పోరాట సన్నివేశం కోసం మేకర్స్ ఏకంగా ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించినట్లు నితీష్ తివారీ వెల్లడించారు.

సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పట్ల సాధారణ ప్రేక్షకులు కొన్నిసార్లు తేలికగా మాట్లాడి దానిని ఏఐ లేదా సాధారణ వర్క్‌గా కొట్టిపారేస్తుంటారని, కానీ పర్ఫెక్ట్ ఫ్రేమ్ వెనుక వేలాది మంది కళాకారుల చెమటోడ్చే శ్రమ ఉంటుందని నితీష్ తెలిపారు. కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆర్టిస్టులకు బ్రీఫింగ్ ఇచ్చిన రోజు నుంచి ఆ వర్క్ పూర్తిగా పూర్తయ్యే నాటికి సరిగ్గా ఆరున్నర సంవత్సరాల సమయం పట్టిందని ఆయన వివరించారు.

అలాగే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన `పుష్పక విమానం` డిజైన్ వెనుక కూడా పెద్ద సాహసమే దాగుందని తెలిపారు. పుష్పక విమానం రూపకల్పన కోసమే రెండేళ్ల సమయం కేటాయించామని, ఆ కాలంలోనూ ఒక సైన్స్ ఉంటుందనే నమ్మకంతో దానిని రూపుదిద్దినట్లు నితీష్ పేర్కొన్నారు.

ఈ విమానం కోసం ఏకంగా 40 నుంచి 50 రకాల డిజైన్లను మార్చి చివరకు అత్యంత ప్రామాణికంగా ఉండే ఒక డిజైన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, పాన్ ఇండియా స్టార్ యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

సినిమా విడుదలైన తర్వాత ఈ విజువల్స్ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు