వారెన్ బఫెట్ డైట్ సీక్రెట్: 48 ఏళ్లుగా మంచినీళ్లకు బదులు అదే తాగుతున్న దిగ్గజ ఇన్వెస్టర్!

వారెన్ బఫెట్: వారెన్ బఫెట్ గత 48 ఏళ్లుగా మంచినీళ్లు తాగలేదని, నీళ్లకు బదులుగా కేవలం చెర్రీ కోక్‌ మాత్రమే తీసుకుంటానని బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్‌మన్ ఒక పాడ్‌కా్‌స్ట్‌లో వెల్లడించారు. ఈ విచిత్రమైన డైట్ సీక్రెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్ అవుతోంది.

వారెన్ బఫెట్, న్యూస్‌ఫాస్ట్ తెలుగు: ప్రపంచ కుబేరులలో ఒకరైన, లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన విచిత్రమైన లైఫ్‌స్టైల్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరూ రోజూ లీటర్ల కొద్దీ మంచినీళ్లు తాగుతుంటారు.

కానీ, వారెన్ బఫెట్ మాత్రం ఏకంగా 48 ఏళ్లుగా మంచినీళ్లే తాగలేదనే షాకింగ్ నిజం బయటికొచ్చింది. బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్‌మన్ ఓ పాడ్‌కాట్‌లో ఈ రహస్యాన్ని బయటపెట్టారు.

48 ఏళ్లుగా మంచినీళ్లకు దూరం

తాజాగా ‘ఈక్విటీ మేట్స్ ఇన్వెస్టింగ్’ పాడ్‌కా్‌స్ట్‌లో బిల్ ఆక్‌మన్ మాట్లాడుతూ బఫెట్‌తో తనకున్న జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక డిన్నర్ సమయంలో బఫెట్‌ను నీళ్లు కావాలా అని అడగగా..

ఆయన నవ్వుతూ తిరస్కరించారట. తాను మంచినీళ్లు తాగి 48 ఏళ్లు అవుతోందని, నీళ్లకు బదులుగా తన ఫేవరెట్ డ్రింక్ ‘చెర్రీ కోక్’ నుంచే శరీరానికి కావలసిన హైడ్రేషన్ పొందుతానని బఫెట్ చెప్పినట్లు ఆక్‌మన్ తెలిపారు.

రోజుకు ఐదు కెన్ల కోకాకోలా

గతంలో ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తన ఆహార అలవాట్ల గురించి వెల్లడించారు. తాను తీసుకునే 2,700 క్యాలరీల ఆహారంలో పావు వంతు భాగం కేవలం కోకాకోలా నుంచే వస్తుందని తెలిపారు.

రోజుకు కనీసం ఐదు 12-ఔన్స్ పొడవాటి కెన్ల కోక్‌ను ఆయన ఖాళీ చేస్తుంటారట. దాదాపు 50 ఏళ్ల పాటు పెప్సీ తాగిన ఆయన, ఒక పక్కింటి వ్యక్తి సూచనతో 1986లో చెర్రీ కోక్‌కు మారారు.

ప్రస్తుతం 96 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ బఫెట్ తన ఈ విచిత్రమైన ఆహార అలవాట్లను కొనసాగిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు