దీపావళి కానుక పేరుతో సైబర్ మోసం, NewzFast Telugu: దీపావళి పండుగ వేళ ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
‘పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తోంది, వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో ఒక నకిలీ సందేశం వైరల్ అవుతోంది. ఈ సందేశంలో ఇతరులను నమ్మించేలా ‘నిజంగానే డబ్బులు వచ్చాయి’ అనే మాటలు కూడా ఉంటున్నాయి.
ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఉంది.
మీ ప్రమేయం లేకుండానే క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని గుర్తుంచుకోవాలి.
అనుమానాస్పద లింక్‌లను ఇతరులకు లేదా వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేయవద్దని కూడా సూచిస్తున్నారు. బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీ వంటి గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.
ఒకవేళ సైబర్ మోసం బారిన పడితే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని, లేదా అధికారిక వెబ్‌సైట్ cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

