ఎమ్మెల్సీకి డీప్‌ఫేక్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ కేసు, NewzFast Telugu (హైదరాబాద్): సోషల్ మీడియాలో పెడతామంటూ ఓ ఎమ్మెల్సీని బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠాను నార్సింగి పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ముఠా ఎమ్మెల్సీ వ్యక్తిగత వీడియోలను డీప్‌ఫేక్ టెక్నాలజీతో అసభ్యకరంగా మార్చి ఆయన మొబైల్‌కు పంపింది. తమకు డబ్బు ఇవ్వకపోతే వీడియోలను ప్రచారం చేస్తామని బెదిరించింది.
దీంతో ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు ఆయన నిందితులతో బేరసారాలు జరిపారు.
చివరకు రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది.
ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వచ్చిన ఆరుగురు నిందితులు డబ్బు తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 14 మంది ఉన్న ముఠాలో మిగతా ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్సీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

