ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం, NewzFast Telugu (జన్నారం, తెలంగాణ): జన్నారం మండలంలోని ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర, విద్యార్థుల భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి వివరించారు.
విద్యార్థులు ఏ విధంగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారో కూడా ఆయన వివరించారు. సైబర్ నేరాలకు గురికాకుండా ఎలా తమను తాము రక్షించుకోవచ్చో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ముత్యం సతీష్, లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

