Kothagudem AR constable wife murder case, NewzFast Telugu (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సోషల్ మీడియాలో పరిచయమైన ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలం వారి వైవాహిక జీవితం సజావుగా సాగినట్లు చెబుతున్నారు.
టేకులపల్లికి చెందిన నరేందర్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన రెండేళ్ల క్రితం భవానీని వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ దంపతులు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో నివసిస్తున్నారు.
ఎనిమిది నెలల క్రితం ఈ దంపతులకు ఒక బాబు జన్మించి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంతకాలంగా నరేందర్ భవానీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం నరేందర్ భవానీని హత్య చేసి, మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టి గోదావరి నదిలో పడేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకముందే నరేందర్ త్రీ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
హత్యకు దారితీసిన కారణాలు, మృతదేహం లభ్యమైందా లేదా అనే అంశాలపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.


