ఖిల్లాఘనపూర్ మండలం దొంగతనాల కేసుల ఛేదన, NewzFast Telugu (వనపర్తి జిల్లా): వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలంలో మేకలు, గొర్రెల దొంగతనాలతో పాటు రాత్రివేళ ఇళ్లలో జరిగిన చోరీల కేసులను పోలీసులు ఛేదించారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఖిల్లాఘనపూర్ బస్టాండ్ వద్ద ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, మానాజీపేట రోడ్డు వైపు నుంచి ఒక బైక్పై ఇద్దరు వ్యక్తులు మేకను తీసుకువస్తూ కనిపించారు. అనుమానంతో పోలీసులు వారిని ఆపి విచారించారు.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించి మరింత విచారించగా, దొంతికుంట తండా, కర్నె తండాల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

