మాజీ జడ్పీటీసీ ఆత్మహత్య, NewzFast Telugu (రఘునాథపల్లి): రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బొల్లం మణికంఠ అలియాస్ అజయ్ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. మాజీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కార్యక్రమాల కోసం అధికంగా ఖర్చు చేయడంతో అప్పుల భారం పెరిగి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
గురువారం ఉదయం సుమారు 6 గంటలకు వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆయన బయటకు వెళ్లారు. అనంతరం గ్రామంలోని పాత ప్రతిభ హైస్కూల్ ఆవరణలోని బాదం చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి భార్య బొల్లం అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

