యాదాద్రి భువనగిరి రైతు లక్ష్మీనారాయణ పంట నష్టం, NewzFast Telugu (యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామానికి చెందిన నీల లక్ష్మీనారాయణకు ఐదెకరాల భూమి ఉంది. ఆయన ఒక బోరు ఆధారంగా మూడెకరాల్లో వరి సాగు చేశారు.
పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు అందక మొత్తం పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోవడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వ్యవసాయానికి తోడుగా ఉన్న నాలుగు పాడి పశువులకు నీరు, గ్రాసం అందించలేక వాటిని అమ్ముకున్నారు. పంట నష్టం, కుటుంబ పోషణ భారం కలిసిపోవడంతో ఇప్పుడు ఆయన రోజువారీ కూలీగా పని చేస్తున్నారు.
ఒకప్పుడు తన పొలంలో వ్యవసాయం చేసిన చేతులే నేడు కూలి పనులు చేస్తున్నాయి. వడ్లు పండించే రైతే పట్టెడన్నం కోసం కష్టపడాల్సిన దుస్థితి రావడం స్థానికులను కలచివేస్తోంది.

