ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘కల్ట్’ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం

విశ్వక్ సేన్ కల్ట్ ఓటీటీ: యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్ట్’ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ‘కల్ట్’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు.

విశ్వక్ సేన్ కల్ట్ ఓటీటీ, NewzFast Telugu: యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్ట్’ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ‘కల్ట్’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఓ వర్గం ప్రేక్షకులకే నచ్చింది.

యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడలేకపోయారు. దీంతో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

ప్రస్తుతం చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఓటీటీ విడుదలపై ఆసక్తికర సమాచారం వెలువడింది. స్క్విడ్ గేమ్ తరహాలో వయలెంట్‌గా సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం.

‘కల్ట్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని, థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగిందని తెలుస్తోంది.

ఈ లెక్కన నవంబర్ చివరి వారంలో విశ్వక్ సేన్ సినిమా ఓటీటీలోకి రావొచ్చని అంచనా. ఈ చిత్రాన్ని తారక్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మించారు.

కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బసూర్ సంగీతం అందించారు. ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో రవి బసూర్ అందించిన బీజీఎమ్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

కథ విషయానికి వస్తే, గోవాలో సరదాగా గడపడానికి వెళ్లిన కొంతమంది యువకులు ఓ రహస్య పార్టీ కోసం ఒక దీవికి వెళతారు. అక్కడ కొందరు దుండగులు గేమ్ ఆడాలంటూ పార్టీలోని కొందరిని దారుణంగా చంపుతుంటారు.

ఆ పబ్‌లో ఉన్నవారిలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా ఉంటారు. పార్టీలో ఉన్న 300 మందిని ఆయన ఎలా కాపాడారు, వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి భయానక ఆట ఆడారు అనేది సినిమాలో చూడాలి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు