విరాట్ కోహ్లీ డైవింగ్ క్యాచ్, NewzFast Telugu: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 37 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని ఫిట్‌నెస్‌తో అతను అదరగొడుతున్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకుని అతను ఔరా అనిపించాడు. ఆ తర్వాత చేసిన సెలబ్రేషన్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత బౌలర్ అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్షణాల్లో స్పందించాడు. ఎడమ వైపునకు డైవ్ చేస్తూ బంతి నేలను తాకకముందే ఒడిసిపట్టాడు.
క్యాచ్ క్లీన్‌గా అందుకున్నానని చేతితో సైగలు చేశాడు.
క్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీ విల్లు ఎక్కుపెట్టినట్లుగా ‘బౌ-అండ్-యారో’ స్టైల్‌లో సెలబ్రేషన్ చేశాడు. ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
