వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు ప్రమాణస్వీకారం

వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు: తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, వివిధ జిల్లాల వెలమ సంఘ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెలమ కార్పొరేషన్‌ను ప్రకటించారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడైన జువ్వాడి నర్సింగరావును చైర్మన్‌గా ప్రకటించడంతో, హైదరాబాద్‌లో అధికారులు ఆయనతో ప్రమాణ.

వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, NewzFast Telugu (కోరుట్ల, జగిత్యాల జిల్లా): తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, వివిధ జిల్లాల వెలమ సంఘ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెలమ కార్పొరేషన్‌ను ప్రకటించారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడైన జువ్వాడి నర్సింగరావును చైర్మన్‌గా ప్రకటించడంతో, హైదరాబాద్‌లో అధికారులు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేవీపీ రాంచందర్‌రావు, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సింగరావును వివిధ జిల్లాల వెలమ సంఘ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, జువ్వాడి మిత్ర బృందం సభ్యులు, మంత్రులు ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడిన నర్సింగరావు, వెలమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు