ఉస్మాన్ ఖవాజా, NewzFast Telugu: ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన జీవిత కథ ‘సబర్’లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ టాంపరింగ్ వివాదంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియాలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఖవాజా తన పుస్తక ప్రచారానికి సంబంధించిన ఇంటర్వ్యూలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.
“ఈ వ్యవహారంపై ఇప్పటికే సోషల్ మీడియాలో చెప్పేశా. అలాగే నా పుస్తకంలో కూడా రాశా.
ఇకపై ఆ వివాదాస్పద విషయాలను మాట్లాడను” అని ఖవాజా స్పష్టం చేశారు.
2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్ ‘శాండ్ పేపర్’ వివాదంలో బాధ్యులుగా నాటి కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.
బంతి ఆకారం మార్పునకు సంబంధించిన విషయం నాటి ఆస్ట్రేలియా జట్టులోని అందరికీ తెలుసునని ఖవాజా వెల్లడించడం తాజాగా మరింత చర్చకు దారితీసింది.




