అమెరికా మధ్యంతర ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ వీటో హెచ్చరిక, NewzFast Telugu: అమెరికాలో మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే, వారు ఆమోదించే బిల్లులను అడ్డుకోవడానికి తన వీటో అధికారాలను ఉపయోగిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
సోమవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రిపబ్లికన్లు ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే తాను ‘మిస్టర్ వీటో’గా మారుతానని ట్రంప్ అన్నారు. దేశాన్ని నాశనం చేయడానికి వారిని అనుమతించబోనని కూడా ఆయన తేల్చి చెప్పారు.
డెమోక్రాట్లు ఆమోదించి పంపే బిల్లులను ఒకట్రెండు నెలల పాటు వీటోలతో తిరస్కరిస్తానని ట్రంప్ వివరించారు. ఇలా చేయడం ద్వారా చివరికి వారిని చర్చలకు రప్పిస్తానని, భవిష్యత్తులో ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చి చట్టాలు ఆమోదించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే రిపబ్లికన్లే కాంగ్రెస్‌లో మెజారిటీని నిలబెట్టుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అవకాశం ఉంటే మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని, అయితే రాజ్యాంగం ప్రకారం రెండు సార్లకంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అనుమతి లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

