అండర్-19 ఆసియా కప్, NewzFast Telugu (మస్కట్, ఒమన్): అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు గురువారం కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. తొలి సెమీఫైనల్‌లో పటిష్ట ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై 70 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
మరోవైపు ఇదే గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది. భారత యువ జట్టు గ్రూప్ దశలో నేపాల్, యూఏఈపై విజయాలు సాధించినప్పటికీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
దీంతో గ్రూప్-ఎలో రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
పాకిస్తాన్ గ్రూప్ దశలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించి అద్భుత ఫామ్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో మలేషియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై 106 పరుగుల తేడాతో నెగ్గి దుర్భేద్యమైన ఫామ్‌ను కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్లు 14వ తేదీన జరిగే ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి.




