అండర్ 19 ఆసియా కప్ 2026, NewzFast Telugu: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది.
కెప్టెన్ లక్ష్య రాయ్ చందాని 90 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శనివారం జరిగే ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
లీగ్ దశలో ఇరు జట్లు ఎదురుపడగా పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది.
సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. నోమన్ సలార్జాయ్ 51, షా ఫైజల్ రహిమి 51 పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించగా, సోహైల్ ఖాన్ 36 నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లు, ఆర్యన్ సవ్సాని రెండు వికెట్లు తీశారు.
228 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు లక్ష్య, ఆర్యవీర్ సెహ్వాగ్ దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు.
ఆర్యవీర్ సెహ్వాగ్ 57 బంతుల్లో 51 పరుగులు చేయగా, వీకే వినీత్ 62 బంతుల్లో 57 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.




