విద్య, వైద్యానికే ఉచితాలు ఇవ్వాలి: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్: విద్య, వైద్యానికే ఉచితాలు ఇవ్వాలని, అప్పుడే సమాజం బాగుపడుతుందని, అన్నింటికీ ఉచితాలు ఇస్తే సోమరిపోతులు తయారవుతారని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ వైద్యశాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో కూడా కొన్నింటికే ఉచితాలు ఉన్నాయని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో చదివిన వారే వైద్య వృత్తిలో రాణిస్తారని స్పష్టం చేశారు. ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో నిమ్స్.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, NewzFast Telugu (తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా): విద్య, వైద్యానికే ఉచితాలు ఇవ్వాలని, అప్పుడే సమాజం బాగుపడుతుందని, అన్నింటికీ ఉచితాలు ఇస్తే సోమరిపోతులు తయారవుతారని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ వైద్యశాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో కూడా కొన్నింటికే ఉచితాలు ఉన్నాయని తెలిపారు.

ఉత్తమ ప్రమాణాలతో చదివిన వారే వైద్య వృత్తిలో రాణిస్తారని స్పష్టం చేశారు.

ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో నిమ్స్ తరహాలో పరికరాలతో పాటు పరిపూర్ణమైన వైద్య సేవలు అందాలన్నారు. దీనికి తన సహకారం ఉంటుందన్నారు.

భగవంతుని రూపంలో డాక్టర్లు ఉంటారని కొనియాడారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు.

గత ప్రభుత్వం తుంగతుర్తి అభివృద్ధిని అడ్డుకుందన్నారు.

ఆస్పత్రిలో జరుగుతున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది తదితర వివరాలపై ఆయన సమీక్షించారు. నిర్మాణమవుతున్న ఏరియా ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు.

డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆస్పత్రికి ఐదు పడకలతో కూడిన డయాలసిస్ సెంటర్ మంజూరైందన్నారు. డిసెంబర్ 30లోగా భవన నిర్మాణం పూర్తవుతుందని, ఈ మేరకు ఏర్పాటయ్యే సదుపాయాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ అధ్యక్షురాలు అనురాధ, పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి, వివిధ గ్రామాల సర్పంచులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు