త్రిగుణ్ జంగా గ్లింప్స్, NewzFast Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్10తో బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, ప్రస్తుతం హౌస్‌లో తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తనదైన శైలిలో గేమ్‌ను మలుపు తిప్పుతూ ‘గేమ్ చేంజర్’ అనే ముద్రతో దూసుకుపోతున్నారు.
కొంతమంది ఆయన ఆటను విమర్శిస్తున్నప్పటికీ, మరోవైపు అభిమానులు మాత్రం ఆయనకు భారీగా మద్దతు ఇస్తున్నారు.
ఇలా హౌస్‌లో బిజీగా ఉన్న త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగా’కు సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘కొన్ని లక్షల ఏండ్లు పట్టింది పశువు మనిషి అవ్వడానికి… మళ్ళీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను’ అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ఈ గ్లింప్స్ అత్యంత ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇందులో త్రిగుణ్ సైకిల్‌పై వెళ్తూ మందు తాగుతున్న మాస్ ఎంట్రీ ఆకట్టుకునేలా ఉంది.
‘మనుషులు పశువైతే మరణం వధమతాది’ అంటూ సాగే నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఈ చిత్రంలో పవర్ఫుల్ లేడీ రోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవిన్ గడ్డం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా పఠాన్ హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్మ కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న త్రిగుణ్ నుంచి వస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీపై టాలీవుడ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.




