తిరుమల శ్రీవారి సర్వదర్శనం, NewzFast Telugu (తిరుపతి): తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఈ పరిస్థితి కొనసాగుతోంది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,085గా నమోదైంది. ఇదే రోజున 26,232 మంది తలనీలాలు సమర్పించారు.
సోమవారం హుండీ ఆదాయం రూ.3.93 కోట్లుగా ఉంది.




