జూన్ 2 నాటికి టిమ్స్‌లు పూర్తి స్థాయి సేవలందించాలి: సీఎం రేవంత్ రెడ్డి

టిమ్స్ సేవలు జూన్ 2: వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉస్మానియా నూతన ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చూడాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల.

టిమ్స్ సేవలు జూన్ 2, NewzFast Telugu (హైదరాబాద్): వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉస్మానియా నూతన ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చూడాలన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణ పనులు, పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్స కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మూడేళ్లలోనే 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సనత్ నగర్, అల్వాల్, ఎల్‌బీ నగర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం పాటించాలని ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు.

ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సూచించారు.

టిమ్స్ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని, హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని సీఎం తెలిపారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు వేరే సిబ్బంది ఉంటే వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించగలరని అన్నారు.

నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్ నగర్ టిమ్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో బెడ్స్ లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్ నగర్ టిమ్స్‌ను వినియోగించుకోవాలన్నారు.

టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమైన మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, ఏఐతో పర్యవేక్షణ చేయాలని కూడా సూచించారు.

మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఔట్ పేషెంట్ల సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు, ఇన్ పేషెంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరిగినట్లు సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్నారు.

మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, పారా మెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేశామని, మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని సీఎం తెలిపారు. వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులు ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తూ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు