టీజీ టీమార్స్, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ-టీఎంఏఆర్‌ఎస్)కు మొదటి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా జరిగిన ఐపీఎస్ బదిలీల్లో ఈ బ్యూరోకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.
ఈ బ్యూరోకు మొదటి డైరెక్టర్‌గా ఎం స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. ఐజీ కే రమేశ్ నాయుడును రైల్వేస్ ఐజీగా, డీ జోయల్ డేవిస్‌ను జాయింట్ డైరెక్టర్ (రోడ్ సేఫ్టీ), జాయింట్ డైరెక్టర్ (ట్రాఫిక్)గా నియమించారు.
శ్రీబాలాదేవికి డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) బాధ్యతలు అప్పగించారు.
ట్రాఫిక్ నియంత్రణ, రైల్వే భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విభాగాల్లో ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోంది. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, ఈ-చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ డాటా విశ్లేషణ, ప్రాసిక్యూషన్‌తోపాటు రైలు ప్రయాణ భద్రత అంశాలు కూడా ఈ బ్యూరో పరిధిలో ఉంటాయి.
ప్రస్తుతం కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో వేర్వేరుగా కొనసాగుతున్న ట్రాఫిక్ విభాగాలకు రాష్ట్రస్థాయిలో ఒకేవిధమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డాటా విశ్లేషణ, సమీక్ష వ్యవస్థను తీసుకురావడమే టీమార్స్ ప్రధాన ఉద్దేశం. గత సెప్టెంబర్‌లో ఈ ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేస్తూ 300 పోలీసు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.




