Telangana Youth Congress leaders suspended for skipping Delhi rally, NewzFast Telugu (Hyderabad): ‘ఓట్ బచావో- దేశ్ బచావో’ నినాదంతో ఢిల్లీలో ఇండి కూటమి నిర్వహించిన ప్రదర్శనకు హాజరుకాని 14 మంది రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మంగళవారం తెలిపారు.
ఈ ప్రదర్శనకు నేతలంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రదర్శనకు రాని ఆరుగురు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు రాష్ట్ర కార్యదర్శులు, హైదరాబాద్ అధ్యక్షుడిని సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
