తెలంగాణ ఐపీఎస్ బదిలీలు, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నవంబర్ 12న ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారుల బాధ్యతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో మహేశ్ మురళీధర్ భగవత్‌ను నియమించారు. వీసీ సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డీజీగా బాధ్యతలు అప్పగించారు.
అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
డాక్టర్ సౌమ్య మిశ్రాను జైళ్ల శాఖ డీజీ బాధ్యతల నుంచి బదిలీ చేసి, డీజీపీ (మహిళా భద్రత), షీ టీమ్స్, భరోసా విభాగాల బాధ్యతలు అప్పగించారు. అదనంగా డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ బాధ్యతలు కూడా అప్పగించారు.
ఆమె స్థానంలో స్వాతి లక్రాను జైళ్ల శాఖ డీజీగా నియమించారు. హోంగార్డ్స్ డీజీ బాధ్యతలను కూడా ఆమెకు అదనంగా అప్పగించారు.
ఇతర కీలక బదిలీల్లో చారు సిన్హాను అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా సీఐడీ డీజీ బాధ్యతలు అప్పగించారు.
డాక్టర్ అనిల్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
వై. నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.
పౌరసరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారు. విక్రమ్ సింగ్ మాన్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీ (ఆపరేషన్స్)గా నియమించారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
ఎం. స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా నియమించారు.
అకున్ సబర్వాల్‌ను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు. కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ బాధ్యతలు కూడా అప్పగించారు.
సంజయ్ కుమార్ జైన్‌కు అదనపు డీజీపీ (ట్రైనింగ్) బాధ్యతలు అప్పగించారు.
మరికొందరు అధికారులకూ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎస్.
చంద్రశేఖర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా నియమించారు. కార్తికేయను మల్టీ జోన్-1 ఐజీగా నియమించి, ఐసీసీసీ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
కె. రమేష్ నాయుడును రైల్వే ఐజీగా నియమించారు.
డి. జోయల్ డేవిస్‌ను రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు.
జి. చందన దీప్తికి జోగులాంబ జోన్-7 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
ఆర్. భాస్కరన్‌కు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
కె. నారాయణ నాయక్‌కు బాసర జోన్-2 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
ఎల్.ఎస్. చౌహాన్‌ను డీఐజీ (కోఆర్డినేషన్)గా నియమించి, చార్మినార్ జోన్-6 డీఐజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
శ్రీ బాలాదేవిని TG-TMARS డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించారు. వి.
అరవింద బాబును హైదరాబాద్ సిటీ డీసీపీ (SM&IT)గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1654లో మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలను వెల్లడించింది.




