Telangana hospitals power and water supply preparedness, NewzFast Telugu (Hyderabad): ఎల్‌నినో నేపథ్యంలో ఆస్పత్రుల్లో నీరు, విద్యుత్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ (డీఎస్‌హెచ్) పరిధిలో నిర్మాణాలు పూర్తయిన 9 భవనాల్లో అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేసి, ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు.
డీఎస్‌హెచ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కూడా మంత్రి ఆదేశించారు.

