తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు, NewzFast Telugu (తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఆన్‌లైన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. రెండు రోజులు పనిచేయని సీఈవో వెబ్‌సైట్ మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరిగి పనిచేస్తోంది.
అర్హత కలిగిన పట్టభద్రుల నుంచి ఫారం-18 ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో స్వీకరిస్తున్నట్లు సీఈవో కార్యాలయం తెలిపింది. తొలి విడతలో ఫారం-18 దరఖాస్తులకు ఈ నెల 6 చివరి తేదీగా ప్రకటించారు.
ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ స్వీకరిస్తారు.
ఆ సమయంలోనూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 22, 23 నిబంధనల ప్రకారం జాబితా నిరంతర సవరణకు అందుబాటులో ఉంటుంది.
తుది జాబితా ప్రచురణ తర్వాత కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.
