ఫిబ్రవరిలో తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్, లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ

తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్: తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (టీసీపీఎల్) టీ20 క్రికెట్ టోర్నీ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ లీగ్ లోగో, అధికారిక వెబ్‌సైట్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7 నుంచి జరిగే ఈ టోర్నీలో 16 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ, ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ నిర్వహిస్తున్న 7హెచ్ స్పోర్ట్స్ సంస్థను, ఆ సంస్థ.

తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (టీసీపీఎల్) టీ20 క్రికెట్ టోర్నీ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది.

ఈ లీగ్ లోగో, అధికారిక వెబ్‌సైట్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7 నుంచి జరిగే ఈ టోర్నీలో 16 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.

కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ, ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ నిర్వహిస్తున్న 7హెచ్ స్పోర్ట్స్ సంస్థను, ఆ సంస్థ ఫౌండర్-డైరెక్టర్ వెంకటేశ్‌ను కేటీఆర్ అభినందించారు.

కార్పొరేట్ ఉద్యోగులు క్రీడా స్ఫూర్తిని, తమ క్రికెట్ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర యాదవ్ పాల్గొన్నారు.

నాలుగో సీజన్‌లో పాల్గొనేందుకు కార్పొరేట్ ఉద్యోగులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని వెంకటేశ్ తెలిపారు. వివరాలకు 93477 77794, 98490 377774 నంబర్లను సంప్రదించవచ్చు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు